తెలంగాణ

telangana

ETV Bharat / sitara

25 రోజుల్లో కోర్టు సెట్​.. ఆశ్చర్యపోయిన హైకోర్టు సిబ్బంది - suriya jai bhim movie

ఎక్కువ భాగం కోర్టులోనే తీసిన 'జై భీమ్'.. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటోంది. అయితే సినిమాలో చూపించిన కోర్టు సెట్​ను కేవలం 25 రోజుల్లోనే తీర్చిదిద్దారట.

jai bhim suriya
సూర్య జై భీమ్

By

Published : Nov 8, 2021, 3:54 PM IST

సూర్య కీలక పాత్రలో జ్ఞానవేల్‌ తెరకెక్కించిన కోర్టు రూమ్‌ డ్రామా 'జై భీమ్‌'. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు, విమర్శకులనూ మెప్పించింది. సూర్య, లిజోమోల్, మణికంఠన్‌ల నటన హైలైట్‌గా నిలిచింది. జస్టిస్‌ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని అత్యధిక భాగం కోర్టు సన్నివేశాలతో నడుస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మద్రాసు హైకోర్టును రీక్రియేట్‌ చేసింది. కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్‌ చూసి, గత కొన్నేళ్లుగా మద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులే ఆశ్చర్యపోయారు.

సూర్య జై భీమ్ మూవీ

1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ కె.కదిర్‌, సినిమాట్రోగ్రాఫర్‌ ఎస్‌.ఆర్‌.కదిర్‌లు ఎంతో కృషి చేశారు. దర్శకుడు త.శె.జ్ఞానవేల్‌ ఊహలకు ప్రాణం పోశారు. సెట్‌వేసే సమయంలో జస్టిస్‌ చంద్రు కూడా అక్కడకు వచ్చి సలహాలు ఇచ్చారట.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details