తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Jai Bhim at Oscars: 'జై భీమ్‌'కు మరో అరుదైన గౌరవం - ఆస్కార్​ ముంగిట జైభీమ్​

Jai Bhim at Oscars: ప్రముఖ సినీ నటుడు సూర్య న్యాయవాదిగా నటించిన చిత్రం జైభీమ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని ఆస్కార్​ యూట్యూబ్​ ఛానెల్​ అయిన అకాడమీ అవార్డ్స్​లో ప్రసారం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Jai Bhim at Oscars
'జై భీమ్‌'కు మరో అరుదైన గౌరవం

By

Published : Jan 18, 2022, 1:22 PM IST

Jai Bhim at Oscars: మాస్‌ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం 'జై భీమ్‌'. తా.సే.జ్ఞానవేల్‌ దర్శకుడు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది.

అకాడమీ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో జైభీమ్​ ప్రసారం

వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. అకాడమీ(ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'జై భీమ్‌' ఇండియన్‌ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్‌ చంద్రు జీవితకథ ఆధారంగా 'జై భీమ్‌'ను తెరకెక్కించారు.

ABOUT THE AUTHOR

...view details