తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్ చిత్రానికి పనిచేస్తున్న జగపతి బాబు - hollywood

లయన్ కింగ్ చిత్రానికి తన గొంతును అరువు ఇస్తున్నాడు జగపతి బాబు. స్కార్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. ముఫాసా పాత్రకు రవిశంకర్ తన గొంతునిస్తున్నాడు.

జగపతి బాబు

By

Published : Jun 26, 2019, 8:08 AM IST

హాలీవుడ్ చిత్రం లయన్​ కింగ్ తెలుగు అనువాదానికి తన గొంతు అరువు ఇస్తున్నాడు టాలీవుడ్ నటుడు జగపతి బాబు. లయన్ కింగ్​లో ప్రతినాయకుడైన స్కార్​ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇందులో ముఖ్యపాత్రైన ముఫాసా పాత్రకు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తన గొంతు ఇవ్వనున్నాడు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 19న విడుదల కానుంది. ఇంగ్లిషు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలో ముఫాసా పాత్రకు షారుఖ్ డబ్బింగ్ చెప్పనుండగా.. సింబా పాత్రకు కింగ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చెప్పనున్నాడు.

1994లో విడుదలైన లయన్ కింగ్ యానిమేటడ్ చిత్రం ప్రస్తుతం అదే పేరుతో రీమేక్​గా రూపొందింది. జాన్ ఫేవరో దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాను డిస్నీ సంస్థ నిర్మించింది.

ఇది చదవండి: 'స్పైడర్​మ్యాన్' విడుదల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details