తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆనందయ్య మందుపై జగపతిబాబు ఆసక్తికర ట్వీట్​ - జగపతిబాబు ఆనందయ్య నాటువైద్యం

కృష్ణపట్నం ఆనందయ్య మందుకు త్వరలోనే అనుమతి రావాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపారు. ఆ మందుతో కరోనా వైరస్​ నుంచి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్​ చేశారు.

Jagapathi Babu supports Anandayya Corona Mandu
ఆనందయ్య మందుపై జగపతిబాబు ఆసక్తికర ట్వీట్​

By

Published : May 25, 2021, 6:28 PM IST

Updated : May 25, 2021, 6:40 PM IST

కరోనా వైరస్​ నిర్మూలనకు కృష్ణపట్నం ఆనందయ్య మందుకు సానుకూల ప్రభావం కనిపించడం వల్ల దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతుంది. ఆయుష్​ కమిషనర్​ కూడా ఇటీవలే ఈ మందును పరిశీలించి అందులో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కలుగజేసే కారకాలు లేవని తేల్చి చెప్పారు. దీంతో ఆనందయ్య మందుపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. ప్రస్తుతం ఆనందయ్య మందును ప్రజలకు పంచడానికి ముందుగా సమగ్ర పరిశీలన చేస్తున్నారు.

దీనిపై సినీనటుడు జగపతిబాబు ట్విట్టర్​లో స్పందించారు. ఆనందయ్య కనుగొన్న మందుకు త్వరలోనే అనుమతి వచ్చి కరోనా వైరస్​ నుంచి ప్రజలకు కాపాడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు.

"మ‌న‌ల్ని కాపాడేందుకు ప్రకృతే ఆయన రూపంలో మన ముందుకొచ్చినట్లు అనిపిస్తుంది. ఆనందయ్య గారి వైద్యానికి త్వరగా అనుమతి వచ్చి.. ప్రపంచాన్ని కాపాడాలని ఆశిస్తున్నా. ఆయనను దేవుడు ఆశీర్వదించాలి" అని జగపతిబాబు ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్​

Last Updated : May 25, 2021, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details