తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ సినిమా నుంచి జగపతిబాబు ఔట్ - విజయశాంతి

కొన్ని పరిస్థితుల కారణంగానే మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'లో నటించడం లేదని చెప్పాడు నటుడు జగపతిబాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేశ్​బాబు సినిమా నుంచి జగపతిబాబు ఔట్

By

Published : Jul 19, 2019, 5:49 PM IST

సూపర్​స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం కశ్మీర్​లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి నటుడు జగపతిబాబు తప్పుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై ఈ రోజు స్పష్టతనిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు జగపతిబాబు ట్వీట్స్ చేశారు.

"‘సరిలేరు నీకెవ్వరు’లో నటించడానికి జగపతిబాబు చాలా ఆసక్తి చూపారు. తన పాత్రను ఇష్టపడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇందులో నటించడం లేదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు" -అనిల్ రావిపూడి, దర్శకుడు

అనిల్ రావిపూడి ట్వీట్

"నేను సినీ ఇండస్ట్రీలో 33 ఏళ్లుగా ఉన్నా. ఇలా ఎప్పుడూ వివరణ​ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి నేను తప్పుకున్నానని చాలా పుకార్లు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఇప్పటికీ ఆ పాత్రంటే నాకిష్టం. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అందులో నటించడం లేదు. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్​ ది బెస్ట్."

-జగపతిబాబు, నటుడు

ఈ సినిమాలో మహేశ్​బాబు ఆర్మీ మేజర్​గా కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దిల్​రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించనుందీ చిత్రం.

ఇది చదవండి: ఆర్మీ అధికారిగా మహేశ్... ఫస్ట్​​ లుక్​ లీక్​

ABOUT THE AUTHOR

...view details