తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాన్నకు ప్రేమతో'లో విలన్​గా అరవింద్​ స్వామి.. కానీ..! - తెలుగు సినిమా వార్తలు

ఓ సినిమాలో ప్రముఖ నటుడు అరవింద స్వామి చేయాల్సిన పాత్ర జగపతి బాబు చేశాడు. ఆ పాత్ర జగపతి బాబుకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ క్యారెక్టర్​ ఏంటీ? ఆ సినిమా ఏంటో తెలుసా?

JAGAPATHI BABU
అరవింద స్వామి

By

Published : Dec 4, 2019, 6:31 AM IST

Updated : Dec 4, 2019, 7:27 AM IST

సినిమాల్లో ఎవరో చేయాల్సిన పాత్రల్ని కొన్ని కారణాల వల్ల మరొకరు చేస్తుంటారు. అలాంటి పాత్రల్లో కొన్ని.. నటులకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడతాయి. ఇలాంటి సంఘటనే జగపతిబాబు విషయంలో చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అరవింద్​ స్వామి నటించాల్సిన ఓ కీలకపాత్ర జగపతిబాబు ఖాతాలోకి వెళ్లింది.

జూనియర్​ ఎన్టీఆర్​ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో కృష్ణమూర్తి పాత్ర ఎంతో కీలకమైంది. ప్రతినాయక ఛాయలున్న ఈ పాత్రలో నటించేందుకు ముందుగా చిత్రబృందం అరవింద్‌ స్వామిని సంప్రదించిందట. అప్పటికే తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న అరవింద్​.. ఈ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో తెలుగులో స్టైలిష్​ విలన్​గా కొనసాగుతున్న జగపతిని ఎంపిక చేశాడు సుకుమార్​. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జగపతి బాబు మరోమెట్టు ఎదిగాడు.

ఇవీ చూడండి.. 'ఫేమస్​ లవర్' ​కోసం లవర్స్​డే వదిలేసిన చైతూ..!

Last Updated : Dec 4, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details