తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జగన్మోహనుడికి సినీ ప్రముఖుల శుభాకాంక్షలు - jagan mohan reddy

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్​మోహనుడికి సినీప్రముఖుల శుభాకాంక్షలు

By

Published : May 24, 2019, 2:18 PM IST

Updated : May 24, 2019, 4:33 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సత్తా చాటి త్వరలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సినీ స్టార్లు వెంకటేశ్, మహేశ్​బాబు, నాగార్జున, నాని, రవితేజ, కాజల్​ శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరగని పోరాటం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారని జననేతపై అభినందనల వర్షం కురుస్తోంది. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేశారు సెలబ్రిటీలు.

'మీ అద్భుతమైన విజయానికి శుభాకాంక్షలు.. ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో రాష్ట్రం మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా'

- మహేశ్​బాబు, టాలీవుడ్​ హీరో​

" ఘన విజయం సాధించిన నూతన యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు ".

-- నాగార్జున, సినీహీరో

" ఆంధ్రప్రదేశ్‌కు యువ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మంచి పాలన అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు".

-- రవితేజ, సినీహీరో

" వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా".

-- నాని, సినీహీరో

" జగన్​కు అభినందనలు. ఇది పవర్‌ఫుల్ విక్టరీ ".

-- వెంకటేశ్ దగ్గుబాటి, సినీహీరో

.

Last Updated : May 24, 2019, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details