తమిళ నటుడు ధనుష్‌తో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల కానుంది. ఐశ్వర్య లక్ష్మి నాయిక. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించి రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాత్రల్ని పరిచయం చేస్తూ, సాంకేతిక వర్గ వివరాలు తెలియజేసే విధానం ఆకట్టుకుంటోంది.
తుపాకి పేలుస్తూ అదరగొడుతున్న ధనుష్ - ధనుష్ కొత్త చిత్రం మోషన్ పోస్టర్ విడుదల
తమిళ నటుడు ధనుష్ కొత్త చిత్రం 'జగమే తంత్రం' ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
![తుపాకి పేలుస్తూ అదరగొడుతున్న ధనుష్ dhanush](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6133913-thumbnail-3x2-rk.jpg)
అదరగొడుతున్న ధనుష్ ఫస్ట్‌లుక్
ధనుష్ రెండు విభిన్న పాత్రల్లో అదరగొడుతున్నాడు. ఓ పాత్రలో తెల్లని దుస్తులు ధరించి తుపాకి పేలుస్తుంటాడు ధనుష్. ఇందులో మాస్‌గా, మరోచోట క్లాస్‌గా దర్శనమిచ్చి అంచనాలు పెంచుతున్నాడు. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్య సంగీతం అలరించేలా ఉంది. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Mar 1, 2020, 10:19 PM IST