బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్‌లు కలిసి నటించనున్న చిత్రం 'భూత్ పోలీస్'. హారర్ కామెడీ నేపథ్యంలో కథతో తీస్తున్న చిత్రానికి పవన్ కిర్పాలానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ ఎంపికైనట్లు చిత్రబృందం ప్రకటించింది.
'భూత్ పోలీస్'లో జాక్వెలిన్, యామి గౌతమ్ - 'బూత్ పోలీస్' సినిమా
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ల 'భూత్ పోలీస్'లో హీరోయిన్లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ ఎంపికయ్యారు.
!['భూత్ పోలీస్'లో జాక్వెలిన్, యామి గౌతమ్ Jacqueline Fernandez, Yami Gautam join star cast of Bhoot Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8661634-950-8661634-1599116573215.jpg)
జాక్విలిన్, యామి గౌతమ్
హారర్ కామెడీ ప్రధానంగా వస్తోన్న ఈ చిత్రాన్ని ధర్మశాల, పాలంపూర్, డల్హౌసీలో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ ఎలా చేయాలన్న అంశంపై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నారు. చిత్రీకరణ 80 శాతంపైగా ఔట్డోర్లోనే జరగనుంది. మిగిలిన సన్నివేశాలను ముంబయిలోని సెట్లో పూర్తి చేయనున్నారు.