తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దేశం విడిచివెళ్లేందుకు నటి యత్నం.. అడ్డుకున్న అధికారులు - jacqueline fernandez latest news

Jacqueline fernandez news: మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయం చేరుకున్న ఆమెను అక్కడి అధికారులు అడ్డుకున్నారు.

jacqueline fernandez news
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

By

Published : Dec 5, 2021, 8:52 PM IST

Jacqueline fernandez news: మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయం చేరుకున్న ఆమెను అక్కడి అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఆమెపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేసిన నేపథ్యంలోనే జాక్వెలిన్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే, జాక్వెలిన్‌ను మాత్రం అరెస్టు చేయలేదని సమాచారం.

రూ.200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్‌ కేసు విచారిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ప్రధాన నిందితుడిగా సుకేశ్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్‌ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. ఈ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:'ఆర్​ఆర్​ఆర్'​ కౌంట్​డౌన్​.. మరో 50 రోజులు మాత్రమే

ABOUT THE AUTHOR

...view details