Pawan Kalyan: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇది పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు గతంలో చిత్రబృందం వెల్లడించింది.
అయితే ఈ చిత్రం నుంచి జాక్వెలిన్ తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మరో బీటౌన్ భామ నర్గీస్ ఫక్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది.