ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలతో పోటీపడుతూ చిత్రసీమలో దూసుకెళ్తున్నారు హీరోయిన్స్. 'అందాల్ని ఆరబోయటమే కాదు.. మేమూ ఫైట్లు, స్టంట్లు చేయగలమ'ని నిరూపిస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా కావల్సింది ఫిట్నెస్. అందుకే ఇటీవలి కాలంలో దీనికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు కథానాయికలు. కసరత్తులు చేయకుండా వారి రోజు కూడా గడవదు!
పోల్డ్యాన్స్తో మ్యాజిక్ చేస్తున్న అందాల తారలు! - కృతి కర్బందా పోల్ డ్యాన్స్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పలువురు బాలీవుడ్ తారలు.. రకరకాల వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్, డ్యాన్స్ ఇలా పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు చేసిన పోల్ డ్యాన్స్ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ సారి వాటిపై ఓ లుక్కేద్దాం..
![పోల్డ్యాన్స్తో మ్యాజిక్ చేస్తున్న అందాల తారలు! pole dance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12497597-575-12497597-1626606614544.jpg)
కొందరు యోగా చేస్తే.. ఇంకొందరు జాగింగ్ చేస్తూ ఉంటారు. మరికొందరు జిమ్‌లో వర్క్ఔట్స్తో శ్రమిస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోయిన్లు.. ఒకడుగు ముందుకేసి.. వ్యాయామాలతో పాటు మరో కొత్త మంత్రాన్ని పాటిస్తున్నారు. అదే 'పోల్ డ్యాన్స్.' విన్యాసాలతో కూడిన ఈ డ్యాన్స్‌ను నేర్చుకుంటూనే.. ఫిట్నెస్ పొందాలని తహతహలాడుతున్నారు. అప్పుడప్పుడు తమ పోల్ డ్యాన్స్ విన్యాసాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. అవి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓసారి ఈ భిన్నమైన డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరిస్తున్న తారల విశేషాలు చూసేద్దాం...
ఇదీ చూడండి: సెగలు పుట్టిస్తున్న తారల అందాలు