రోజూ ఉదయాన్ననే లేచి గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందని బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెబుతోంది. కొన్ని రోజులుగా రణ్వీర్ సింగ్తో కలిసి 'సర్కస్' చిత్రీకరణలో బిజీగా గడిపిన ఈ భామ.. కాస్త విరామం తీసుకుంది. ఈ సమయంలో హార్స్ రైడింగ్ చేయడం ప్రారంభించింది. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
"ఉదయాలు మనల్ని రీఛార్జి చేసకోవడానికి పనికొచ్చే అద్భుత సమయాలు.. ఎంతో ఉత్సాహమిచ్చే ఉదయాలను ఎవరూ మిస్ అవొద్దు. షూటింగ్లతో నేను వీటిని ఎక్కువగా మిస్ అవుతుంటా"