ఇప్పటివరకు తాను చేసిన పాత్రల ద్వారా చాలా నేర్చుకున్నానని, ఏదో ఓ రోజు యాక్షన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లను పూర్తయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అమితాబ్, సంజయ్ దత్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధానపాత్రల్లో నటించిన 'అలాద్దీన్'(2009) సినిమాతో తెరంగేట్రం చేసిందీ భామ.
"కెరీర్లో ఎంతోమంది ఉత్తమ దర్శకులు, నటీనటులతో కలిసి పనిచేయడం నాకు దొరికిన ఆశీర్వాదంగా భావిస్తాను. విభిన్నమైన, సవాళ్లున్న పాత్రల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ ద్వారా చాలా నేర్చుకున్నా. ఇవి భవిష్యత్‌లో మరింత ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. ప్రతి సినిమాలో ఇదే రకమైన అనుభవంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను"