అక్షయ్ కుమార్ హీరోగా, ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బచ్చన్ పాండే'. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన అజిత్ చిత్రం 'వీరం'కు రీమేక్ ఇది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ కీలకపాత్రకు కృతిసనన్ ఎంపికవ్వగా.. మరో కీలకపాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను చిత్రబృందం సంప్రదించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. "యాక్షన్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'బచ్చన్ పాండే' చిత్రంలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని పోస్ట్ పెట్టింది.
'బచ్చన్ పాండే'లో కీలక పాత్రకు ఎంపికైన జాక్వెలిన్ - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వార్తలు
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కొత్త చిత్రం 'బచ్చన్ పాండే'. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
'బచ్చన్ పాండే'లో కీలకపాత్రకు ఎంపికైన జాక్వెలిన్
'బచ్చన్ పాండే' సాజిద్ నడియాడ్ వాలా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పదో చిత్రం కాగా.. మరోవైపు ఇదే నిర్మాతతో జాక్వెలిన్ 8వ సారి కలిసి పనిచేస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా, కృతి సనన్ జర్నలిస్టుగా తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చిత్రీకరణను జనవరి నుంచి ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ కలిసి హౌస్‌ఫుల్ సిరీస్‌తో పాటు 'బ్రదర్స్' సినిమాలోనూ నటించారు.
Last Updated : Dec 1, 2020, 10:24 PM IST