తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జబారియా జోడీ'కి ముహూర్తం మారింది - 'జబారియా జోడీ'

సిద్దార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా జంటగా నటించిన 'జబారియా జోడీ' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

'జబారియా జోడీ'

By

Published : Jul 29, 2019, 6:17 PM IST

వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన 'జబారియా జోడీ' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ సింగ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 2నే విడుదలకావల్సి ఉండగా వాయిదా పడింది.

సినిమా రిలీజ్​ అంశంపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఆగస్టు 2న చాలా సినిమాలు విడుదలకానున్నాయని, ఇప్పటికే విడుదలైన చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలు. అపర్‌ శక్తి ఖురానా, సంజయ్‌ మిశ్రా, నీరజ్‌ సూద్‌, గోపాల్‌ దత్‌, జావెద్‌ జాఫ్రీ, చందన్‌ రాయ్‌ సన్యాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఏక్తా.. నాకు ఫోన్‌ చేసి కథ గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఈ విషయం గురించి తెలుసుకొని, ఆశ్చర్యపోయా. వాస్తవానికి ఈ కథాంశం వేరే అయినా, మేం వినోదాత్మకంగా చూపించాలని అనుకున్నాం. ఏ కథనైనా నవ్వించేలా చెబితే ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి వినోదాన్ని అందించేలా సినిమా తీశాం'.
-పరిణీతి చోప్రా, కథానాయిక

సిద్దార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా

కథేంటి?

బిహార్‌, ఉత్తర్​ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పెళ్లి కొడుకును అపహరించి వివాహం చేస్తారు. వధువు కుటుంబాన్ని వరకట్నం నుంచి తప్పించేందుకు ఇలా చేస్తారు. కట్నం వద్దంటేనే పెళ్లి తంతు కొనసాగిస్తారు.

ఇది సంగతి: పెళ్లి సందడితో నవ్వించే 'జబారియా జోడీ'

ABOUT THE AUTHOR

...view details