తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లి సందడితో నవ్వించే 'జబారియా జోడీ' - బాలీవుడ్​ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా

బాలీవుడ్​ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా జంటగా నటించిన చిత్రం 'జబారియా జోడీ'. ఈ సినిమా ట్రైలర్​ సోమవారం విడుదలైంది. ఆగస్టు 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

పెళ్లి లొల్లితో నవ్వించే 'జబారియా జోడీ'

By

Published : Jul 2, 2019, 9:00 AM IST

ప్రశాంత్‌ సింగ్‌ దర్శకత్వంలో బాలీవుడ్​ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా కలిసి నటించిన సినిమా 'జబారియా జోడీ'. ఈ ట్రైలర్​ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. పెళ్లి నేపథ్యంగా సాగే ఓ రొమాంటిక్​ ప్రేమకథా చిత్రమిది.

" నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనకు కాస్త హాస్యం జోడించి తెరకెక్కించారు దర్శకుడు. వరకట్నంపై చిన్నపాటి సందేశం ఉంటుంది. నేను, పరిణీతి కలిసి నటించిన వెరైటీ లవ్​స్టోరీ ఇది ".
-- సిద్ధార్థ్​ మల్హోత్రా, సినీ నటుడు

ఇందులో అభయ్‌ పాత్రలో సిద్ధార్థ్‌, బబ్లీగా పరిణీతి సందడి చేశారు. 2014లో వచ్చిన 'హసీతో ఫసీ' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ.. ఐదేళ్ల తర్వాత మరోసారి జోడీగా అలరించనున్నారు. ఏక్తా కపూర్​ నిర్మాత. ఆగస్టు 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details