'జబర్దస్త్' ఫేం ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. అనుజతో కలిసి బుధవారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. అనుజ మెడలో అవినాష్ తాళికట్టే దృశ్యాల్ని 'ఆటో' రామ్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' ఫేమ్ ముక్కు అవినాష్ - ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' ఫేమ్ ముక్కు అవినాష్
'జబర్దస్త్' ఫేం ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు.
అవినాష్
'క్షమించు అవినాష్. చాలా పెద్ద తప్పు జరిగింది. నేను సాయం చేయలేకపోయాను' అని సరదా వ్యాఖ్యని జోడించారు రామ్ ప్రసాద్. అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు.
'జబర్దస్త్' కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్. పలువురు హీరోల పాత్రల్ని అనుకరించి తనదైన మార్క్ చూపించారు. ప్రముఖ రియాల్టీ షో 'బిగ్‌బాస్'లోనూ ఆయన సందడి చేశారు.