బుల్లితెరపై స్టార్ కమెడియన్గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ నటుడు 'సాఫ్ట్వేర్ సుధీర్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'రాజుగారి గది' ఫేం ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది.
'సాఫ్ట్వేర్'గా మారిన సుడిగాలి సుధీర్..! - dhee dance show
జబర్దస్త్, ఢీ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. 'సాఫ్ట్వేర్ సుధీర్' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్... 'సాఫ్ట్వేర్ సుధీర్' అయ్యాడు
ఇతర పాత్రల్లో ఇంద్రజ, షాయాజీ షిండే, బ్రహ్మానందం కనిపించనున్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది చదవండి: అమ్మో అమ్మాయేనా.. ఇంతందం సాధ్యమా