Jabardast anasuya: 'నటీనటులమైనప్పటికీ మేము కూడా మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి' అని నటి-యాంకర్ అనసూయ అంటోంది. వ్యాఖ్యాత, నటిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె.. ఓ జర్నలిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయ లేటస్ట్ ఫొటోలతో ప్రత్యేక కథనాన్ని రాసిన ఓ విలేకరి.. "వైట్ శారీలో దేవకన్యలా ఉన్న అనసూయ.. ముద్దుగుమ్మ అనసూయ అందాల ఆరబోతకు వెనకడుగు వేయదు. అయితే ఆమె వయస్సు 40" అని రాసుకొచ్చారు. అది చూసిన అనసూయ ఆగ్రహానికి లోనైంది.
ట్విటర్ వేదికగా ఆ ఆర్టికల్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "నా వయసు 40 కాదు 36. వయసు పెరగడం అనేది సర్వసాధారణం. నా వయసును చెప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు. కాబట్టి మీరు వార్తలు రాసేటప్పుడు కచ్చితమైన సమాచారాన్ని పద్ధతిగా ఇస్తే బాగుంటుంది. చెప్పే విషయాన్ని కాస్త మర్యాదపూర్వకంగా చెబితే బాగుంటుంది. ఎందుకంటే జర్నలిజం అనేది ఒక ఆయుధం. దాన్ని మనం చక్కగా నిర్వహించకపోతే ఎదురుదెబ్బలు తగులుతాయి" అని అనసూయ రాసుకొచ్చింది.