తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Anasuya: యాంకర్​తో అనసూయ గొడవ.. షో నుంచి బయటకు - Jabardast latest promo

యాంకర్​ అనసూయ(Anasuya), మరో యాంకర్​ వ్యాఖ్యలకు హర్ట్​ అయింది. దీంతో షో మధ్యలోనే వదలి బయటకు వెళ్లిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

anasuya
అనసూయ

By

Published : Jun 19, 2021, 10:19 AM IST

Updated : Jun 19, 2021, 11:05 AM IST

జబర్దస్త్(jabardast) లేటేస్ట్ ప్రోమో విడుదలైంది. యాంకర్ అనసూయ(Anasuya) మరో యాంకర్​ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి, కోపంతో షో నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఏం జరిగింది?

హైపర్​ ఆది(hyper aadi), రాకెట్​ రాఘవ, అదిరే అభి వీరంతా తమ స్క్రిప్ట్​లతో పంచ్​లు, కామెడీ చేస్తూ వీక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఈ షోలో హైపర్​ ఆది టీమ్​లో యూట్యూబ్​ యాంకర్​ శివ కూడా కనిపించాడు. ఈ క్రమంలోనే అతడు.. 'పొట్టి డ్రెస్స్​లు ఎందుకు వేసుకుంటావ్​?' అని వేదికపై అనసూయను ప్రశ్నించాడు? 'ఇది నా పర్సనల్​' అంటూ ఆమె బదులిచ్చింది. ఇలా వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడం, ఆ తర్వాత అనసూయ కోపంతో షో మధ్యలో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో జడ్జెస్​ రోజా(roja), మనులతో సహా వీక్షకులకు షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే జూన్​ 24న పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: 'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత!

Last Updated : Jun 19, 2021, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details