తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లిరికల్: జాతర చేస్తున్న నందమూరి 'మంచోడు'

'ఎంత మంచివాడవురా' సినిమాలోని 'జాతరో జాతర' అంటూ సాగే లిరికల్ గీతం అలరిస్తోంది. ఈ పాటను 'బిగ్​బాస్ 3' విజేత రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. సంక్రాంతి కానుకగా రానుందీ చిత్రం.

By

Published : Dec 27, 2019, 8:41 PM IST

లిరికల్: జాతర చేస్తున్న నందమూరి 'మంచోడు'
'ఎంత మంచివాడవురా' సినిమాలోని 'జాతరో జాతర' పాట

అసలే చేసేది మూడు రోజుల పండుగ. మరి జాతర ఎంత భారీ స్థాయిలో జరగాలి. ఆ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత తీసుకురావాలి. అందుకే అందమైన భామను దింపి, పతంగుల పండుగలో హుషారు నింపుతున్నాడు మంచోడు. నందమూరి కల్యాణ్​రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచి వాడవురా'. ఇందులోని 'జాతరో జాతర' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. 'బిగ్‌బాస్‌ 3' విజేత రాహుల్‌ సింప్లిగంజ్‌ పాడటం విశేషం.

సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ స్వరపరిచిన ఈ గీతం.. సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటతో పాటు అందులోని నృత్యం అలరిస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్‌ హీరోయిన్. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకుడు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మంచోడు'.

ABOUT THE AUTHOR

...view details