తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్యాట్​మ్యాన్​గా మారనున్న... 'వ్యాంపైర్'​ - robert pattinson

త్వరలో కొత్త బ్యాట్​మ్యాన్ రానున్నాడు. ట్విలైట్​ సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్​ ప్యాటిన్సన్ గబ్బిలం మనిషిగా నటించనున్నాడు. మ్యాట్ రీవ్స్ దర్శకత్వం వహించబోతున్న 'ద బ్యాట్​మ్యాన్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు రాబర్ట్​.

బ్యాట్​మ్యాన్

By

Published : Jun 1, 2019, 1:10 PM IST

ట్విలైట్ సిరీస్​లో వ్యాంపైర్​గా మెప్పించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్​ ప్యాటిన్సన్ బ్యాట్​మ్యాన్​ అవతారమెత్తనున్నాడు. ఈ పాత్రకు సంబంధించి వార్నర్ బ్రదర్స్​ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు రాబర్ట్​. మ్యాట్​ రీవ్స్​ దర్శకత్వం వహించబోతున్న 'ద బ్యాట్​మ్యాన్' సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఈ ఏడాది చివర్లో లేదా 2020 ప్రారంభంలో కానీ 'ద బ్యాట్​మ్యాన్' సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కిస్తున్న 'టెనెట్' చిత్రంలో నటిస్తున్నాడు రాబర్ట్. ఇవే కాకుండా నెట్​ఫ్లిక్స్​ చిత్రాలు 'ద లైట్ హౌస్'​, 'వెయిటింగ్ ఫర్ ద బార్బేరియన్స్' సినిమాల్లోనూ ముఖ్య భూమిక పోషించనున్నాడు.

మ్యాట్ రీవ్స్ ఇంతకముందు 'లెట్​ మీ ఇన్', 'డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్'​, 'వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

ఇప్పటివరకు 3 సినిమాల్లో బ్యాట్​మ్యాన్​ పాత్రను పోషించిన బెన్ అఫ్లెక్ ఇటీవలే తప్పుకున్నాడు. 'బ్యాట్​మ్యాన్ వర్సస్​ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్', 'సూసైడ్ స్క్వాడ్', 'జస్టిస్​ లీగ్' చిత్రాల్లో బెన్ అఫ్లెక్​ గబ్బిలం మనిషిగా కనిపించాడు.

ఇది చదవండి: సైకోకిల్లర్​ వేటలో... 'అల్లుడు శ్రీను'

ABOUT THE AUTHOR

...view details