స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నారని మనకు తెలుగు. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. నయన్ వేలికి ఉంగరం, విఘ్నేశ్ షేర్ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా? అన్న చర్చ అప్పటినుంచే మొదలైంది. ఇప్పుడదే విషయంపై స్పష్టతనిచ్చింది నయన్.
చెప్పేసింది!
ఇటీవల ఓ తమిళ టీవీషోలో పాల్గొన్న నయన్.. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన చేతికి ఉన్నది ఎంగేజ్మెంట్ ఉంగరమేనని చెప్పేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్.. తానూ, నయన్ పెళ్లికి రెడీ అవుతున్నామని, అందుకోసం డబ్బు సమకూరుస్తున్నామని చెప్పారు.