కరోనాతో దాదాపు నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఇటీవలే ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తిరిగి మొదలయ్యాయి. అయితే తక్కువ విస్తీరణమున్న భవనాల్లో(ఇండోర్) షుటింగ్, డబ్బింగ్ చెప్పడం సరికాదని బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత శేఖర్ కపూర్ అన్నారు.
ఇలా చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఫలితంగా కరోనా త్వరగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు.
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా పలువురు నటీనటులు.. తమకు కరోనా సోకిందని ధైర్యంతో బహిరంగంగా చెప్పడం ప్రశంసనీయమని శేఖర్ కపూర్ అన్నారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.