తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఊబకాయంపై అర్జున్​కపూర్​ నిత్యపోరాటం - BONY KAPOOR

ఊబకాయంపై పోరాటం ఆపే ప్రసక్తే లేదంటున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. గత మూడేళ్లలో 50 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. జిమ్​లో వ్యాయామం చేస్తున్న ఫొటోల్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

'ఆ సమస్యపై ప్రతిరోజు పోరాడుతున్నా'

By

Published : Jun 19, 2019, 7:46 AM IST

Updated : Jun 19, 2019, 8:03 AM IST

ఈ ప్రపంచంలో ఏ బాధలేని వారు ఉండరేమో అంటే అతియోశక్తి కాదు. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య ఉంటుంది. అలాంటి దానిపై రోజూ పోరాటం చేస్తున్నానని అంటున్నాడు బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌.

గత కొన్నేళ్ల నుంచి ఊబకాయంతో బాధపడుతున్నాడీ నటుడు. బరువును తగ్గించుకునే పనిలో భాగంగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న కొన్ని ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

జిమ్​లో వ్యాయామం చేస్తున్న అర్జున్ కపూర్

"ఇది నిజంగా కష్టమైనది. ఊబకాయంపై పోరాటం ఆపే ప్రసక్తే లేదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఈ సమస్యపై నిత్యం పోరాడుతూనే ఉంటా. ఏదో ఒక రోజు ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ మూడేళ్లలో నేను 50 కిలోల బరువు తగ్గా" -అర్జున్ కపూర్, బాలీవుడ్ హీరో

ప్రస్తుతం అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో ‘పానిపత్​’ చిత్రంలో సదాశివ్‌ రావు బాహు అనే పాత్రలో నటిస్తున్నాడు అర్జున్ కపూర్. హీరోయిన్​గా కృతి సనన్, కీలక పాత్రలో సంజయ్‌దత్‌ నటిస్తున్నారు.

పానిపత్ సినిమా పోస్టర్

ఇది చదవండి: 'కౌసల్య కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'నని అంటున్న మెగాస్టార్ చిరంజీవి

Last Updated : Jun 19, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details