తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మార్వెల్​- సోనీ బ్రేకప్​పై సూపర్​ హీరో స్పందన - sony

ప్రముఖ మార్వెల్​ స్టూడియో, సోనీ సంస్థల మధ్య సినిమా హక్కులు పంచుకునే ఒప్పందం ఇటీవలే ముగిసింది. అయితే రెండు సంస్థలు ఒప్పందం పునరుద్ధరించుకునేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఆ సంస్థల్లో పనిచేసిన తన పరిస్థితి అయోమంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు నటుడు టామ్​ హోలాండ్.

స్పైడర్ మ్యాన్

By

Published : Aug 26, 2019, 7:00 AM IST

Updated : Sep 28, 2019, 7:03 AM IST

మార్వెల్​ స్టూడియో, సోనీ సంస్థల మధ్య సినిమా హక్కుల పంపకం ఒప్పందం కుదరలేదు. ఈ షాకింగ్​ నిర్ణయంతో తన భవిష్యత్తు సందిగ్ధంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు స్పైడర్​ మ్యాన్​ నటుడు టామ్​ హోలాండ్​.

డిస్నీ పిక్చర్స్​ ప్యానెల్​ ఆధ్వర్యంలోని డీ23 ఎక్స్​పోలో వస్తోన్న 'ఆన్​వర్డ్​' సినిమా ప్రచారానికి హాజరైన టామ్...​ ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు.

"మార్వెల్​-సోనీ విడిపోవడం వల్ల ఈ వారం కాస్త గందరగోళం ఏర్పడింది. కానీ కష్టసమయంలో వెంట నిలిచిన అభిమానులకు నేను బుణపడి ఉంటాను. మీ అందరినీ అమితంగా ప్రేమిస్తున్నా"
-టామ్ హోలాండ్​, స్పైడర్​ మ్యాన్​లో సూపర్ హీరో

ఆగస్టు 20న మార్వెల్​-సోనీ సంస్థల సినిమా హక్కులు పంచుకొనే ఒప్పందం ముగిసింది. ఈ సిరీస్​కు నిర్మాతగా వ్యవహరించిన కివీన్​ ఫైజీతో సంబంధం ముగిసిందని తెలిపాయి స్పైడర్​ మ్యాన్​ ఫిల్మ్​ ఫ్రాంచైజీ.

'స్పైడర్​ మ్యాన్​ హోమ్​కమింగ్'​,'స్పైడర్​ మ్యాన్​: ఫార్​ ఫ్రమ్​ హోమ్'​ను నిర్మించాడు ఫైజీ​. ఈ రెండు చిత్రాలు సోనీ సంస్థకు భారీ వసూళ్లను తెచ్చిపెట్టాయి.

ఇది చదవండి: భామ కొంటె చూపు.. కుర్రాళ్ల మైమరపు

Last Updated : Sep 28, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details