తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆరు సినిమాలతో మీ ముందుకొస్తా: భూమి పెడ్నేకర్ - భూమి పెడ్నేకర్ న్యూ మూవీస్

Bhumi pednekar new movies: కరోనా థర్డ్​వేవ్​ ప్రభావం తగ్గిపోతే అర డజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తానని నటి భూమి చెప్పింది. తనలో కొత్త నటిని ఈ చిత్రాలు పరిచయం చేస్తాయని తెలిపింది.

Bhumi Pednekar
భూమి పెడ్నేకర్

By

Published : Jan 28, 2022, 6:46 AM IST

Bhumi pednekar news: కరోనా మూడోవేవ్‌ త్వరగా ముగిసిపోతే ప్రేక్షకులను అలరించడానికి ఆరు చిత్రాలతో సిద్ధంగా ఉన్నానని హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ చెబుతోంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్‌ విజయాలు అందుకొంటూ ముందుకెళుతోంది.

భూమి పెడ్నేకర్

వచ్చే నెల 11న 'బధాయి దో' సినిమాతో థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరింబోతుంది భూమి. ఆ తర్వాత ఆమె నుంచి వరస చిత్రాలు రాబోతున్నాయి. 'లేడీ కిల్లర్‌', 'భీడ్‌', 'గోవిందా నామ్‌ మేరా', 'రక్షాబంధన్‌' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించబోతుందట.

"కరోనా నుంచి ప్రజలు త్వరగా బయటపడిపోతే వాళ్లను అలరించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా నుంచి వరసగా ఆరు వైవిధ్యమైన చిత్రాలు రాబోతున్నాయి. అన్నీ కూడా నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్రలే. ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. తొలి సినిమా కోసం ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతే. ఈ చిత్రాలన్నీ నాలో కొత్త నటిని ప్రేక్షకులు పరిచయం చేస్తాయి" అని భూమి చెబుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details