తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రంతో సంబంధమున్నవారిపై ఆదాయ పన్ను శాఖ గురిపెట్టింది. ప్రముఖ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ ఇళ్లపై మెరుపు దాడులు చేశారు అధికారులు. చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్ స్నేహితుడు శరవణన్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మధురైలోని నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు.
అన్బు చెళియన్... తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియర్. విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్కు అతడు ఆర్థిక వనరులు సమకూర్చాడు.