'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు సినీ ప్రియుల మనసు దోచిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నా.. ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత కొన్ని అనుకోని వివాదాల్లో చిక్కుకుని, సినీ కెరీర్‌కు దూరమైంది. 2018లో ఈ అమ్మడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది గడవకముందే విడిపోయారు. తాజాగా తన భర్తతో విడిపోవడంపై స్పందించింది శ్వేత.
ఇది విడాకులు కాదు.. బ్రేకప్: శ్వేతాబసు - It simply felt like breakup Shweta Basu
'కొత్త బంగారు లోకం' నటి శ్వేతా బసు ప్రసాద్ 2018లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఏడాదే అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకుంది. కాగా తాజాగా ఈ విషయంపై స్పందించింది శ్వేత.
![ఇది విడాకులు కాదు.. బ్రేకప్: శ్వేతాబసు Shweta Basu Prasad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10484615-1020-10484615-1612345272907.jpg)
"పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోయాం. కొన్ని కారణాలతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. వివాహం జరిగిన పదేళ్లు లేదా దానికంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా కొంతమంది దంపతులు తమ బంధానికి స్వస్తి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మేమిద్దరం ఎనిమిది నెలల్లోనే దూరం కావాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం కంటే.. ఇది ఓ బ్రేకప్‌లా ఉందనిపిస్తోంది. రోహిత్‌కు దూరమైన సమయంలో ఎంతో బాధపడ్డాను. కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉన్నారు. నాకు నేను ఓ మంచి స్నేహితురాలిగా మారాను" అంటూ శ్వేత వెల్లడించింది.