తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ రష్మికను విచారించిన ఐటీ అధికారులు - IT Raid,

ఐటీ అధికారులు హీరోయిన్​ రష్మికను మంగళవారం విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించారు.

rashmika it raids
హీరోయిన్ రష్మిక

By

Published : Jan 22, 2020, 7:08 AM IST

Updated : Feb 17, 2020, 10:58 PM IST

సినీనటి రష్మిక మందణ్నను ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. మంగళవారం 3 గంటల పాటు విచారించారు. మైసూరులోని ఐటీశాఖ కార్యాలయంలో తండ్రి మదన్‌, తల్లి సుమన్‌లతోపాటు రష్మిక సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. గత వారం విరాజ్‌పేటలోని ఆమె నివాసంతో పాటు సెరెనిటీ కమ్యూనిటీ హాల్‌లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుర్తించిన రూ.25 లక్షల నగదు, ఇతర పత్రాలకు సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించారు. అవసరమైతే మరోమారు విచారణకు హాజరవ్వాలని అధికారులు సూచించారు.

రష్మిక నివాసం
Last Updated : Feb 17, 2020, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details