ఓ సినిమాలో ఐష్‌కు అన్నయ్యగా నటించడం తనని ఎంతగానో బాధపెట్టిందని బాలీవుడ్ నటుడు షారుఖ్ అన్నారు. 2000లో విడుదలైన 'జోష్' సినిమా కోసం షారుఖ్, ఐశ్వర్య మొదటిసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో ఐష్, షారుఖ్ అన్నాచెల్లిగా కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'దేవదాస్' చిత్రంలో నటించినప్పటికీ చివరికి వీరిద్దరూ కలుసుకోకుండానే కథ సుఖాంతం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఒకానొక అవార్డుల ఫంక్షన్‌లో షారుఖ్.. ఐష్‌తో నటించడం గురించి స్పందించారు.
'ఐష్‌కు అన్నగా నటించడం బాధ కలిగించింది' - Aishwarya and sharukh khan mocies
ఈ ప్రపంచంలోనే అందమైన ఐశ్వర్యా రాయ్‌కి అన్నగా నటించడం నాకెంతో బాధ కలిగించిందని అన్నారు షారుఖ్ ఖాన్. ఎప్పటికైనా తనతో ఓ సాధారణమైన సినిమాలో నటించాలనే భావన ఉందని తెలిపారు.
షారుఖ్
"ఐష్, నేను మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'జోష్'. ఆ సినిమాలో మేమిద్దరం కవలలుగా కనిపించాం. ఈ ప్రపంచంలోనే ఎంతో అందమైన ఐష్ నా చెల్లి పాత్రలో నటించడం నాకెంతో బాధగా అనిపించింది. మమ్మల్ని చూసిన చాలామంది మేమిద్దరం నిజమైన అన్నాచెల్లెళ్లుగా ఉన్నామన్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి 'దేవదాస్' సినిమాలో నటించాం. ఆ సినిమాలో కూడా మేమిద్దరం కలవము. ఎప్పటికైనా తనతో ఓ సాధారణమైన సినిమాలో నటించాలనే భావన నాలో ఉంది." అని షారుఖ్ అన్నారు.