బాలీవుడ్ నటుడు సోనూసూద్(Sonu Sood IT Survey) ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు(Sonu Sood IT Raid).. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఇందులో భాగంగా.. సోనూ 'ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్'(విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు ఓ అధికారి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
"ఈ సోదాల్లో.. సోనూ విదేశీ నిధులను తీసుకోవడంలో ఎఫ్ఆర్సీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయి. పెద్ద మొత్తంలో విదేశీ నిధులను వేరే అవసరాల కోసం ఆయన ఖర్చు చేశారు. భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించారు. సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించాం. సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నాం. లెక్కల్లో లేని అనేక రసీదులను స్వాధీనం చేసుకున్నాం. బోగస్ రుణాలు, బోగస్ బిల్లింగ్స్కు సంబంధించిన పత్రాలు ఆదాయపన్ను శాఖ అధీనంలో ఉన్నాయి. తప్పుడు ఖర్చులు చూపించి ఆయన పన్ను ఎగవేతకు పాల్పడ్డారు."
-అధికారి.