తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టూస్టేట్స్​' నిర్మాత, దర్శకుడి మధ్య వివాదం - శివానీ రాజశేఖర్

అడివి శేష్​ హీరోగా నటిస్తున్న 'టూస్టేట్స్​' సినిమా వివాదంలో చిక్కుకుంది. నిర్మాత, దర్శకుడి మధ్య కథ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ విషయం కాస్త కోర్టు కేసుల వరకు వెళ్లింది.

'టూస్టేట్స్​'లో నిర్మాత-దర్శకుడి మధ్య వివాదం

By

Published : May 27, 2019, 3:58 PM IST

శివానీ రాజశేఖర్​ హీరోయిన్​గా పరిచయమవుతున్న చిత్రం 'టూస్టేట్స్'. అడివి శేష్​ హీరో. చిత్ర నిర్మాత- దర్శకుడు మధ్య మనస్పర్ధల కారణంతో షూటింగ్​ మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు కేసుల వరకు వెళ్లింది. నిర్మాత ఎం.ఎల్. వి సత్యనారాయణపై దర్శకుడు వెంకట్​రెడ్డి కేసు పెట్టాడు.

అసలేం జరిగింది...?
చేత‌న్ భ‌గ‌త్ న‌వ‌ల ' టూస్టేట్స్‌' ఆధారంగా.. అదే పేరుతో తెలుగులో సినిమాను రూపొందిస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రీకరణ సాగుతుండగా కథలో కొంత భాగాన్ని మార్చాలని నిర్మాత, దర్శకుడికి చెప్పాడు. ఈ కారణంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి షూటింగ్ ఆగిపోయింది.

"వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్​గా పలు చిత్రాలకు పనిచేశాను. "టూస్టేట్స్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నా. హీరో, హీరోయిన్, నిర్మాతలకు కథ పూర్తిగా వినిపించిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాను. ప్రస్తుతం 70 శాతం చిత్రీకరణ పుర్తయింది. 'టూస్టేట్స్' కథలో మార్పులు చేయమని నిర్మాత నన్ను అడిగారు. నేను తిరస్కరించాను. ఈ సినిమా నుంచి నన్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిర్మాతపై కోర్ట్ లో కేసు వేశాను." -వెంకట్​రెడ్డి, చిత్ర దర్శకుడు

సినిమాపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, ఈ కథలో మార్పులు చేసినా, దర్శకత్వం నుంచి తనను తప్పించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని దర్శకుడు వెంకటరెడ్డి తెలిపాడు.

ఇది చదవండి: బైక్​పై ప్రభాస్.. అభిమానులకు సర్​ప్రైజ్​

ABOUT THE AUTHOR

...view details