తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉండిపో చేతిలో గీతలా.. నుదిటిపై రాతలా'

'ఇస్మార్ట్​ శంకర్' చిత్రంలోని 'ఉండిపో' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ రొమాంటిక్ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చాడు.

By

Published : Jun 29, 2019, 5:21 PM IST

'ఉండిపో చేతిలో గీతలా.. నుదిటిపై రాతలా'

పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో టాలీవుడ్​ ఎనర్జిటిక్​ హీరో రామ్​ నటిస్తోన్న చిత్రం 'ఇస్మార్ట్​ శంకర్​'. నభా నటేష్​, నిధి అగర్వాల్​ కథానాయికలు. ఈ చిత్రంలో 'ఉండిపో' అనే రొమాంటిక్​ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.​

రామ్​, నిధి అగర్వాల్​

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో అందరిలోనూ అంచనాలు పెంచేసిన పూరీ.. ఇప్పుడు ఓ రొమాంటిక్‌ గీతాన్ని బయటకొదిలాడు. "ఉండిపో ఉండిపో చేతిలో గీతలా..." అంటూ సాగే మెలోడీ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి - రమ్య బెహెర ఆలపించారు. ఇందులో సాహిత్యానికి తగ్గట్లుగా బీచ్‌ ఒడ్డున రామ్‌.. తన జోడీ నిధి అగర్వాల్‌తో రొమాన్స్‌లో మునిగితేలాడు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details