తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇస్మార్ట్ శంకర్' విడుదల తేదీ ఖరారు - ram pothineni

రామ్, నిధి అగర్వాల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. జులై 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

రామ్

By

Published : May 26, 2019, 12:51 PM IST

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, ప్రముఖ దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. 'డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ' ట్యాగ్ లైన్‌. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్​తో ఆకట్టుకోనున్నాడు.

ఈ సినిమాను జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతంపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం.

ఇప్పటికే విడుదలైన టీజర్​ సినిమాపై అంచనాలను పెంచేసింది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు.

ఇస్మార్ట్ శంకర్ పోస్టర్

ఇవీ చూడండి.. గౌరవిస్తే దర్శకత్వం వహిస్తా: లారెన్స్

ABOUT THE AUTHOR

...view details