తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టైటిల్​ సాంగ్​తో అదరగొడుతున్న 'ఇస్మార్ట్​ శంకర్'​ - puri jaganath

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్​ శంకర్‌'. నిధి అగర్వాల్, నభా నటేశ్‌ కథానాయికలు. ఈ సినిమా టైటిల్​ లిరికల్​ సాంగ్​ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.

టైటిల్​ సాంగ్​తో అదరగొడుతున్న 'ఇస్మార్ట్​ శంకర్'​

By

Published : Jun 19, 2019, 7:55 PM IST

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఇస్మార్ట్​ శంకర్‌'. నేడు ఈ సినిమాలోని లిరికల్‌ టైటిల్‌ పాటను రామ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. 'ఇగో చెప్తున్నా.. ఈ పాట మాత్రం ఫుల్‌ సౌండ్‌లో వినాలా..' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 'చార్మినార్‌, చాదర్‌ఘాట్‌ అంతా నాదే..' అని హిందీ, తెలుగు మిక్స్‌ చేసున్న లిరిక్స్‌తో సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రామ్​కు జోడీగా నిధి అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఛార్మికౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకి, పాటలకి మంచి స్పందన లభించింది. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ఇందులో కనిపించనున్నారు. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details