తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇస్మార్ట్ శంకర్' టీజర్ వచ్చేది ఎప్పుడంటే ? - పూరీ జగన్నాథ్

ఈ నెల 15న హీరో రామ్ జన్మదినం సందర్భంగా 'ఇస్మార్ట్ శంకర్' టీజర్​ను విడుదల చేయనున్నారు. సంబంధిత వీడియోనూ ట్విట్టర్​లో పంచుకుంది చార్మి.

వచ్చేందుకు సిద్ధంగా 'ఇస్మార్ట్ శంకర్' టీజర్

By

Published : May 13, 2019, 1:32 PM IST

టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేశ్, నిధి అగర్వాల్‌ హీరోయిన్లు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు పూరీ.

‘‘పాటల చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. టాకీ పార్ట్ పూర్తయింది. మే 15 రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌ ’ టీజర్‌ విడుదల చేస్తున్నాం’’ -పూరీ జగన్నాథ్, దర్శకుడు

ఈ చిత్రాన్ని హీరోయిన్ చార్మి, పూరీ జగన్నాథ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details