తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇస్మార్ట్ శంకర్'​ చాలా మాస్ గురూ..! - నిధి అగర్వాల్

కథానాయకుడు రామ్ మాస్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్​' టీజర్​ను విడుదల చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'ఇస్మార్ట్ శంకర్'​ చాలా మాస్ గురూ..!

By

Published : May 15, 2019, 11:20 AM IST

పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరో అంటే మాస్​ పాత్రలకు పెట్టింది పేరు. ​తాజాగా విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' టీజర్​ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇందులో హీరో రామ్ ఇప్పటివరకు అభిమానులు చూడనటువంటి వైవిధ్య పాత్రలో కనిపించనున్నాడు.

'పతాహై మే కౌన్ హు... శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్','నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేల్ని కట్టేసినట్టే','మార్ ముంత చోడ్ చింత' అని హైదరాబాద్​ యాసలో రామ్ చెప్పిన డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ప్రస్తుతం హైదరాబాద్​లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలందించాడు. పూరీ జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ABOUT THE AUTHOR

...view details