రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా "ఇస్మార్ట్ శంకర్". డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఓ వీడియో ద్వారా తెలిపారు. త్వరలోనే గోవాలో మరో షెడ్యూల్ జరుగుతుందని పేర్కొన్నారు.
గోవాకు "ఇస్మార్ట్" - puri jagannath
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'... స్వయంగా నిర్మిస్తున్న 'రొమాంటిక్' చిత్రాలు గోవాలో షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇస్మార్ట్ శంకర్
నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. మే లో సినిమా విడుదలయ్యే అవకాశముందని వెల్లడించారు ఛార్మి.
పూరి తనయుడు.. ఆకాశ్ పూరి "రొమాంటిక్" సినిమా కూడా గోవాలోనే చిత్రీకరణ జరుపుకోనుంది. పూరి జగన్నాధే స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు.