తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇ'స్మార్ట్'​గా షూటింగ్ పూర్తిచేసుకున్న శంకర్ - ram

'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులై 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్, నబా నటేష్ కథానాయికలు.

ఇస్మార్ట్ శంకర్

By

Published : Jul 2, 2019, 5:46 PM IST

హీరో రామ్ నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ పూర్తయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్​ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిధి అగర్వాల్, నబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 18న విడుదల కానుందీ చిత్రం.

ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని మొదట జులై 12న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ప్రపంచకప్ ఫైనల్ ఉన్నందున ఓ వారంపాటు వాయిదా పడింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయి.

పక్కా హైదరాబాదీగా కనువిందు చేస్తున్నాడు రామ్. పాత బస్తీ నేపథ్యంలో చిత్ర కథాంశం సాగనుంది. పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: 'ఆస్కార్' ఎంపికలో భారత సినీ ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details