తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సీక్వెల్ లేదా ప్రీక్వెల్.. మళ్లీ 'ఇస్మార్ట్​' పక్కా - ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్

ఇస్మార్ట్ శంకర్​ రెండో భాగం రూపొందించడం పక్కా అని చెప్పాడు హీరో రామ్. అయితే అది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అనేది చెప్పలేనన్నాడు.

రామ్-పూరీ జగన్నాథ్

By

Published : Nov 10, 2019, 6:31 AM IST

హీరో రామ్.. మాస్​ లుక్​లో కనిపించి, అలరించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం తర్వాతఈ చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాథ్​ హిట్​ అందుకున్నాడు. దాదాపు రూ.80 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. అయితే దీనికి రెండో భాగం​ తీసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త టాలీవుడ్​లో చర్చనీయాంశమైంది. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు రామ్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా పోస్టర్

"ఇస్మార్ట్ శంకర్​కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావొచ్చు. త్వరలోనే మేం మళ్లీ సినిమా చేయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. కానీ కచ్చితంగా సినిమా చేస్తున్నాం" -రామ్, కథానాయకుడు

రామ్.. ప్రస్తుతం 'రెడ్'లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే లాంఛంగా ప్రారంభమైందీ చిత్రం. ఈనెల 16 నుంచి షూటింగ్ మొదలు కానుంది. కిశోర్ తిరుమల దర్శకుడు.

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. సినిమాకు ఫైటర్​ అనే టైటిల్​ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాతే రామ్​తో చేస్తాడా లేదా ఆ తర్వాత ఇస్మార్ట్​కు రెండో భాగం తీస్తాడా అనేది చూడాలి.

ABOUT THE AUTHOR

...view details