తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దుమ్మురేపుతున్న ఇస్మార్ట్ శంకర్ రెండో ట్రైలర్​ - nidhi agerwal

రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' రెండో ప్రచారచిత్రం ఆకట్టుకుంటోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 16 లక్షలుగా పైగా ఈ ట్రైలర్​ను వీక్షించారు. జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇస్మార్ట్ శంకర్

By

Published : Jul 13, 2019, 9:48 AM IST

'ఇస్మార్ట్ శంకర్' రెండో ట్రైలర్ దుమ్మురేపుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 16 లక్షల మందికి పైగా ఈ ప్రచారచిత్రాన్ని వీక్షించారు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్, నిధి అగర్వాల్, నబా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. జులై 18న విడుదల కానుందీ చిత్రం.

ఇటీవలే వచ్చిన తొలి ట్రైలర్​పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే రెండో ప్రచారచిత్రం బాగుందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చాడు.

పూరీజగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించారు. పూరీ దర్శకత్వంలో రామ్ తొలిసారి నటించాడు. ఈ కాంబినేషన్​పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రచార చిత్రం, టీజర్​తో ఈ అంచనాలు భారీగా పెరిగాయి.

ఇది చదవండి: క్రిస్మస్​​కు వస్తున్న నాగ చైతన్య- సాయి పల్లవి

ABOUT THE AUTHOR

...view details