చాక్లెట్ బాయ్ రామ్ మాస్ పాత్రలో అలరించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ ట్విట్టర్లో వెల్లడించింది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా నభా నటేశ్, నిధి అగర్వాల్ నటించారు. మణిశర్మ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇటీవలే యూట్యూబ్లో విడుదలైన 'దిమాఖ్ కరాబ్', 'ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్' ఇందుకు నిదర్శనం.