తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టబుతో ఇషాన్​ ఖట్టర్ ఘాటైన​ రొమాన్స్​! - laetst bollywood news

బాలీవుడ్​ హీరో ఇషాన్​ ఖట్టర్​ హీరోగా, టబు కీలక పాత్రలో నటిస్తున్న వెబ్​సిరీస్​ 'ఎ సూటబుల్​ బాయ్'​. తాజాగా ఈ సిరీస్​ గురించి మాట్లాడిన ఇషాన్​.. సినిమాలో టబు పాత్రతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ishan khattar, tabu news
టబుతో ఇషాన్

By

Published : Aug 4, 2020, 5:01 AM IST

బాలీవుడ్​ హీరో ఇషాన్​ ఖట్టర్​ ప్రధాన పాత్రలో నటించిన వెబ్​సిరీస్​ 'ఎ సూటబుల్​ బాయ్'​. విక్రమ్​ సేథ్​ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో నటి టబు కీలక పాత్రలో కనిపించనుంది. సలామ్​ బాంబే, మాన్​సూన్​ వెడ్డింగ్​ వంటి హిట్​ చిత్రాలనందించిన నాయర్​ ఈ సిరీస్​కు దర్శకత్వం వహించాడు.

దీనిని బీబీసీలో ఆరు భాగాలుగా ప్రసారం చేయనున్నారు. దీంతో ఇషాన్​ తొలిసారి టెలివిజన్​ రంగంలో అరంగేట్రం చేస్తున్నాడు. సిరీస్​లో టబు పాత్రతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఇషాన్​. టబుతో కలిసి కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించినట్లు తెలిపాడు.

ప్రస్తుత కాలంతో పోలిస్తే ఇది అసాధారణమైన రిలేషన్​షిప్​. కథలో ఇది ఎవ్వరూ అంగీకరించని రొమాన్స్​. ఆమె ఒక వేశ్య. హీరో హిందూ కుటుంబానికి చెందిన మంత్రి కుమారుడు. ఇంకా చెప్పాలంటే ఆమె వయసులో సగం ఉటుంది అతడి వయసు. సామాజిక వర్గాల్లో దీనిని క్షమించరాని నేరంగా భావిస్తారు. కానీ, వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో అద్భుతమైనది.

ఇషాన్​ ఖట్టర్​, బాలీవుడ్ నటుడు

ఇటీవలే బ్రిటన్​లో ఈ సిరీస్ ప్రసారమైంది. త్వరలోనే భారత్​ సహా ప్రపంచ వ్యాప్తంగా నెట్​ఫ్లిక్స్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సిరీస్​లో ఖట్టర్​, టబుటో పాటు.. తాన్య మణిక్తాలా, రసిక దుగల్​, రామ్​ కపూర్​, మహీర్​ కక్కర్​ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ABOUT THE AUTHOR

...view details