తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 6:58 PM IST

ETV Bharat / sitara

త్రివిక్రమ్​ తర్వాతి సినిమా ఎవరితో?

త్రివిక్రమ్​-ఎన్టీఆర్​ కాంబోలో ఇప్పటికే ఓ సినిమా ఖరారైంది. అయితే ఈ మాటల మాంత్రికుడు.. సూపర్​స్టార్​ మహేశ్​ బాబుతో చిత్రం చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో త్రివిక్రమ్​ తన నెక్ట్స్​ మూవీ ఈ స్టార్​ హీరోల్లో ఎవరితో చేయనున్నారంటూ అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.

trivikram
త్రివిక్రమ్​

దర్శకుడు త్రివిక్రమ్​ చేయబోయే కొత్త సినిమాపై అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆయన హీరో ఎన్టీఆర్​తో తన తర్వాతి చిత్రం చేయనున్నానంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడా చిత్రం సెట్స్​పైకి వెళ్లడానికి ఆలస్యమవ్వనుందని తెలిసింది. దీంతో మాటల మాంత్రికుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఈ విరామ సమయంలో మహేశ్​తో ఓ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారని వినికిడి. ప్రిన్స్​​ ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' తర్వాత ఆయన 28వ సినిమాగా ఇది రూపొందనుందట. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని ట్విట్టర్​లో ట్రెండింగ్​ అవుతోంది. దీంతో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా చేసేది మహేశ్​తోనా? లేదా ఎన్టీఆర్​తోనా? అని అభిమానులంతా ఆలోచనల్లో పడ్డారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే మాటల మాంత్రికుడు నోరు విప్పేవరకు వేచి ఉండాల్సిందే.

ఒకవేళ త్రివిక్రమ్​.. మహేశ్​తో సినిమా ప్రకటిస్తే పదకొండేళ్ల తర్వాత మూడోసారి ఈ కాంబో రిపీట్​ అయినట్లు అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' విడుదలై అలరించాయి.

ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అందుకేనా?

త్రివిక్రమ్ చెప్పిన కథకు ఎన్టీఆర్​ కొన్ని మార్పులు అవసరమని భావించినట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించేందుకు తారక్​ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదీ చూడండి: 'అప్​డేట్ ఇవ్వండయ్యా!': ట్విట్టర్​లో తారక్​ ఫ్యాన్స్​ ట్రెండింగ్​​

ABOUT THE AUTHOR

...view details