తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్.. గతేడాది వచ్చిన 'ఆదిత్య వర్మ'తో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగు బ్లాక్‌బస్టర్ 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ ఇది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. ధ్రువ్‌ను విజయ్ దేవరకొండతో పోల్చుతూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఈ కారణంతో ఇకపై సినిమాలు చేయకూడదని అనుకుంటున్నాడట ధ్రువ్.
ఒక్క సినిమాతోనే సినీ కెరీర్‌కు పుల్‌స్టాప్! - విక్రమ్
'ఆదిత్య వర్మ'తో ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ తనయుడు ధ్రువ్.. త్వరలో కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టబోతున్నాడనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. తొలి సినిమా అంతగా ఆకట్టుకోకపోవడమే ఇందుకు కారణమని టాక్.
ఒక్క సినిమాతోనే సినీ కెరీర్‌కు పుల్‌స్టాప్!
ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ నుంచి తప్పుకొని, బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే, అతడికి సంబంధించిన కొత్త సినిమా ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.