తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి తెరపై పవన్​ - రేణుదేశాయ్​ కాంబినేషన్​..? - రేణు దేశాయ్​

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, రేణుదేశాయ్​ కలిసి మరోసారి తెరపై కనిపిస్తారట. తాజాగా పవన్​ హీరోగా తెరకెక్కుతోన్నమూడు సినిమాల్లో ఏదో ఒక చిత్రంలో వీరిద్దరూ సందడి చేయోచ్చని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Is-This-Pawan-And-Renu-Team-Up-For-A-Movie
మరోసారి తెరపై పవన్​ - రేణుదేశాయి కాంబినేషన్​..?

By

Published : Feb 1, 2020, 7:26 PM IST

Updated : Feb 28, 2020, 7:36 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రేణు దేశాయ్‌ కాంబినేషన్‌లో విడుదలైన 'బద్రి' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ జంట 'జానీ' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై టాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్‌.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పింక్‌' రీమేక్‌లో నటిస్తున్నాడు. అంతేకాకుండా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాకూ సంతకం చేశాడు.

తాజాగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ ఓ సినిమాలో నటిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్‌ నటించే ఓ సినిమాలో రేణూ నటిస్తారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండొచ్చని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

ఇటీవల రేణు దేశాయ్‌.. మంచి పాత్రలు వస్తే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యవసాయం, రైతులకు సంబంధించిన కథతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇదీ చూడండి... టబు, భూమిక బాటలోనే రేణు దేశాయ్​!

Last Updated : Feb 28, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details