Sirivennela Sitaramasastri died: ప్రఖ్యాత గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి(66) తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
సీతారామశాస్త్రి తన కెరీర్లో దాదాపు 800కు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలను రచించారు. అవి శ్రోతలను ఎంతగానో అలరించాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
సిరివెన్నెల సినీరంగంలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలకుపైగా అయినా, కొత్త రచయితలు పుట్టుకొస్తున్నా ఈయన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రముఖ దర్శకులంతా తమ సినిమాల్లో ఈయన కలం నుంచి చేజారిన అక్షరాలినే పాటలుగా మలిచి తెరకెక్కిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు! ఈ మధ్య వెంకటేష్ 'నారప్ప', వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' సినిమాల్లోనూ ఆయన సాంగ్స్‌ను రాశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'దోస్తీ' పాట కూడా రాసింది ఆయనే. ఈ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆయన చివరిసారిగా పనిచేసింది నాని నటించిన 'శ్యామ్‌సింగరాయ్' కోసం. ఈ చిత్రంలో రెండు పాటలు రాశారు సిరివెన్నెల. ఇవే ఆయన చివరి పాటలు కావడం విషాదకరం.
ఇదీ చూడండి: sirivennela died: తెలుగు పాటకు వెలుగు బాట.. సిరివెన్నెల