హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి గురించి ప్రశ్నిస్తుంటారు. సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉండే నటీమణులకు ఇలాంటి అనుభవం ఎక్కువగా ఎదురవుతుంది. దానికి తగినట్టుగానే వాళ్లు సమాధానం చెప్తుంటారు. ఇన్‌స్టా వేదికగా శ్రుతిహాసన్ ఆదివారం, అభిమానులతో ముచ్చటించింది. ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు లేదు అంటూ సమాధానమిచ్చింది.
ఈ ఏడాదిలో పెళ్లి.. నటి శ్రుతిహాసన్ క్లారిటీ - శ్రుతిహాసన్ న్యూస్
ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నటి శ్రుతిహాసన్.. తన పెళ్లి విషయమై స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది చేసుకోనంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
శ్రుతిహాసన్
గతంలో శ్రుతి ప్రేమ, వివాహం గురించి పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవలే 'క్రాక్'తో మంచి విజయం అందుకున్న ఈమె.. పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్'లో నటించింది. వేసవిలో ఆ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి:శ్రుతిహాసన్ ఒంటిపై ఎన్ని టాటులు ఉన్నాయంటే?
Last Updated : Jan 25, 2021, 6:02 AM IST